జైపూర్(భీమారం)వెలుగు : కోతుల సమస్యలు పరిష్కరించకుంటే సమగ్ర కుటుంబ సర్వేను అడ్డుకుంటామని భీమారం మండల కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు ఎంపీడీఓ ఆఫీసులోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎన్నోసార్లు ఈ సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. రోజుకు భీమారం మండల కేంద్రంలో సుమారు రోజుకు 10 మంది పై కోతులు దాడి చేస్తున్నాయని అన్నారు.
ఓ మహిళ తమ పై కోతులు దాడి చేస్తే రూ.20 వేల హాస్పిటల్ ఖర్చు అయిందని సూపరిండెంట్ కు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు ముందు కోతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, కుమార్, ఖమ్రోద్దిన్, సురేశ్, రాజ్ కుమార్, అరుణ్ , కాలనీ ప్రజలు పాల్గొన్నారు.