క్రైమ్ క్యాపిటల్ లా ఢిల్లీ .. దేశ రాజధానిపై తక్షణమే చర్చ జరగాలి : కేజ్రీవాల్

క్రైమ్ క్యాపిటల్ లా ఢిల్లీ .. దేశ రాజధానిపై తక్షణమే చర్చ జరగాలి : కేజ్రీవాల్
  • కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు లేఖ​ 

న్యూఢిల్లీ:  దేశ రాజధాని.. నేర రాజధానిలా మారిందని ఆమ్​ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ ​కేజ్రీవాల్​ ఆరోపించారు. ఢిల్లీలోని ప్రజలు వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దేశంతో పాటు ప్రపంచమంతా ఢిల్లీని క్రైమ్‌‌ సిటీగా గుర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు శనివారం ఆయన లేఖ రాశారు.

దేశంలోని 19 మెట్రో సిటీల్లో మహిళలపై జరుగుతున్న నేరాలు, హత్య కేసుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. సిటీ అంతటా దోపిడీ ముఠాలు రెచ్చిపోతున్నాయి" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. స్కూళ్లు, ఎయిర్​పోర్టులు, మాల్స్‌‌కు బాంబు బెదిరింపులు తరచూ జరుగుతున్నాయి. డ్రగ్స్ సంబంధిత నేరాలు కూడా 350 శాతం 
పెరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు.