హైదరాబాద్, వెలుగు: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలు డివిజన్లకు చెందిన జనం సోమవారం పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని 132 డివిజన్ పరిధి వెన్నెలగడ్డ ఏరియా,127వ డివిజన్ గాంధీ నగర్, 125వ డివిజన్ చంద్రగిరినగర్, 126 డివిజన్ శ్రీనివాసనగర్ నుంచి దాదాపు 500 మంది కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టనున్న 6 గ్యారెంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా, యువజన నేతలు పాల్గొన్నారు