వైరల్​ ఫీవర్స్​తో వణుకుతున్న ఖమ్మం

వైరల్​ ఫీవర్స్​తో వణుకుతున్న ఖమ్మం
  • ఒకే బెడ్​పై ఇద్దరు..

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరల్​ ఫీవర్స్​తో వణుకుతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలామంది మంచం పడుతున్నారు. మలేరియా,డెంగ్యూ, విష జ్వరాలకు గురవుతున్నారు. మండల పీహెచ్​సీ సెంటర్లలో  రోగులు బ్లడ్ శ్యాంపిల్ ఇస్తే రిపోర్ట్ రావడానికి మూడు రోజులు పడుతోంది. డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్​కు వెళ్లలేని నిరుపేదలు ఖమ్మం  గవర్నమెంట్​హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ చేయించుకునేందుకు  బారులు తీరుతున్నారు. ఓపి(అవుట్ పేషెంట్) కేంద్రం వద్ద పేరును నమోదు చేసుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు.

రోజుకు దాదాపు వేయి మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో రక్త నమూనాలు ఇవ్వడం, రిపోర్టు లు తీసుకోవడం రోగులకు అరిగోసాగా మారింది. కాయకల్ప కింద హాస్పిటల్​కు ర్యాంకులు వచ్చాయని గొప్పలు చెప్పే డాక్టర్లు, ప్రజాప్రతినిధులు సరిపడా బెడ్లు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. జ్వరాల వార్డు లో ఓకే బెడ్ పై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్నారు. వెలుగు