నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: ఈ కేవైసీ కోసం పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఈ కేవైసీకి గడువు ఏమీ లేదని అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక ద్వారక గ్యాస్ ఏజెన్సీ ముందు వినియోగదారుల బుధవారం పెద్ద సంఖ్యలో నిల్చున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి ఈ కేవైసీ చేయించుకున్నారు. శివ్వంపేట మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఆఫీస్ ముందు సైతం ఈ కేవైసీ కోసం వినియోగదారులు ఉదయం నుంచే బారులు తీరారు.