కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోయింది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండేదని, ఇప్పుడు దాన్ని అందరూ మరిచిపోయారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రహ్లాద్ జోషి చెప్పారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 

అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం, లడ్డూ ప్రసాదం అందజేశారు.