సిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చెత్త కుండీల్లా మార్చేస్తున్నారు. పరిశుభ్రంగా ఉండాల్సిన కాలనీలు మురికి వాడల్లా మారుతున్నాయి. కొంతమంది నిర్లక్ష్యం వల్ల చాలా ఏరియాల్లో బస్తీలు డంపింగ్ యార్డుల్లా మారుతున్నాయి. చెత్తా చెదారంతో దోమలు ఎక్కువై... డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నామని వాపోతున్నారు బస్తీ వాసులు.
చాలా ఏరియాలు మురికిగా మారుతున్నయ్
సిటీలోని చాలా బస్తీలో చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా ప్లాస్టిక్ వర్లతో చెత్త పడేసి వెళ్తున్నారని.. దీంతో క్లీన్ చేసినా చెత్త పేరుకుపోతోందంటున్నారు కాలనీ వాసులు. దుర్వాసనతో నరకం చూస్తున్నామని చెబుతున్నారు. చెత్తా చెదారంతో దోమలు ఎక్కువై... డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నామని వాపోతున్నారు. నగరంలో ఏ ఏరియా చూసినా పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. ఎక్కడా ఆచరణలోకి రావడం లేదు.
జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోవట్లే
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు వారంలో రెండు రోజులు మాత్రమే వస్తున్నారంటున్నారు బస్తీవాసులు. కంప్లైంట్ చేస్తే ఫోటోస్ తీసుకుని వెళ్తారంటున్నారు. పై పైన శుభ్రం చేసి వెళ్తున్నారని, నీట్ గా క్లీన్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. చేసేది లేక బస్తీ వాసులంతా కలిసి క్లీన్ చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఎన్ని సార్లు శుభ్రం చేసినా అదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు బస్తీ వాసులు. నగర మేయర్ కే సిటీలోని చెత్త ఇబ్బంది పెడితే.. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని మండిపడుతున్నారు.
అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలె
చెత్త ఎక్కువగా పేరుకు పోవడంతో దోమల బెడద ఎక్కువైందంటున్నారు బస్తీ వాసులు. రైత్రయితే పక్క కాలనీల వాళ్ళు వచ్చి.. తమ ఏరియాలో చెత్త వేస్తున్నారని వాపోతున్నారు. దీని వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో జీహెచ్ ఎంసీ బండి రాకపోవడంతో.. చెత్తని ఎక్కడబడితే అక్కడ వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు.