దేశంలో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు( జులై 13) విడుదలయ్యాయి. 13 నియోజకవర్గాలకు గాను 10 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. అసెంబీ ఉపఎన్నికలో ఇండియా కూటమి విజయంపై కాంగ్రెస్ చీఫ్ మలికారున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ | దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ : రిజల్ట్స్ ఇవే
రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశ ప్రజలు బీజేపీని నమ్మడం లేదని అన్నారు.ఏడు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని తెలిపారు. 'రైతులు, యువకులు, కార్మికులు సహా ప్రతి ఒక్కరూ నియంతృత్వాన్ని పూర్తిగా నాశనం చేసి న్యాయ పాలనను సాపించాలని కోరుకుంటున్నారు. ప్రజలు తమ జీవితాల మెరుగుదల, రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమితో పూర్తిగా నిలబడుతున్నారు' అని పేర్కొన్నారు.
ALSO READ | 7 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఇండియాకూటమి హవా.. బీజేపీ ఘోర ఓటమి
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ విశ్వసనీయత పడిపోతుందనడానికి ఉప ఎన్నికల ఫలితాలు బలమైన నిదర్శనమని కాంగ్రెస్ చీఫ్ మలికారున్ ఖర్గే తెలిపారు. ఇండియా కూటమికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజతలు తెలిపారు ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్లే బీజేపీని ప్రజలు నిరంతరం తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం అని అన్నారు
ఉప ఎన్నికల ఫలితాల వివరాలు
- ఉత్తరాఖండ్ లో జరిగిన రెండు అసెంబ్లీ (బద్రీనాథ్, మంగలూరు)స్థానాల్లో కాంగ్రెస్ విజయం
- హిమాచల్ ప్రదేశ్ రెండు స్థానాల్లో (డెహ్ర, నలగార )కాంగ్రెస్ విజయం
- పశ్చిమ బెంగాల్‌లో నాలుగు చోట్ల(రాయిగంజ్ , రణఘాట్ సౌత్ , బాగ్ద , మాణిక్తలా) ఎన్నికలు జరగ్గా అన్ని చోట్లా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం
- పంజాబ్ జలంధర్ వెస్ట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం
- తమిళనాడులో విక్రవంది నియోజకవర్గంలో DMK అభ్యర్థి విజయం
- బిహార్ రూపౌలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం
- మధ్యప్రదేశ్ అమ్రవారా స్థానంలో బీజేపీ విజయం
- హిమాచల్‌ప్రదేశ్ హమీపూర్లో బీజేపీ విజయం
మొత్తంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 4, టీఎంసీ 4, బీజేపీ 2, ఆప్ 1, డీఎంకే 1, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు.