బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజల్ని మోసం చేస్తుండు : పాయల్ శంకర్

  •  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​ప్రజలు జోగు రామన్నను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా  గెలిపించినా ఆయన ప్రజల్ని మోసం చేశాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని వికలాంగుల కాలనీ, విద్యానగర్ కాలనీల్లో నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆధినాత్, జోగు రవి, అంకత్ రమేశ్, ఆకుల ప్రవీణ్, సోమ రవి, విజయ్, దినేశ్ మటోలియా తదితరులు పాల్గొన్నారు.