శ్రీలంక గెలుపుపై ఆప్ఘాన్ ప్రజల సంబరాలు

శ్రీలంక గెలుపుపై ఆప్ఘాన్ ప్రజల సంబరాలు

ఆసియాకప్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఎంతో ఆశతో టైటిల్ను దక్కించుకుందామనుకున్న పాక్ను శ్రీలంక చిత్తు చేసింది. ఏక పక్షంగా సాగిన ఆసియాకప్ 2022 ఫైనల్లో శ్రీలంక..23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా..6వ సారి ఆసియాకప్ ట్రోఫీని దక్కించుకుంది. ఆసియాకప్ ఫైనల్లో పాక్ ఓటమి చెందడంతో..ఆప్ఘాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 

అంబరాన్నంటిన సంబరాలు..
ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోవడంతో..ఆప్ఘానిస్తాన్ ప్రజల సంబరాలు అంబరాన్నంటాయి. పాక్ ఓటమి తర్వాత ప్రజలు వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. పాక్ ప్రదర్శన చూసి ఎగతాళి చేశారు. కేరింతలు కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్ట్ అబ్దుల్‌హాక్ ఒమెరీ ఈ వీడియోను షేర్ చేశాడు. శ్రీలంక గెలిచిన ఆనందోత్సాహాలతో గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అయింది. 

థాంక్యూ శ్రీలంక...
రెండు మ్యాచ్‌లలో లంక చేతిలో ఓడిపోవడంపై పాక్ను ఆప్ఘాన్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్లో పాక్ను ఓడించడంపై లంకకు ఆఫ్గాన్ ప్రజలు థాంక్యూ చెప్పారు. మమ్మల్ని సంతోషపెట్టినందుకు ధన్యవాదాలు శ్రీలంక..శ్రీలంక విజయాన్ని ఆప్ఘనిస్తాన్ ఆస్వాదిస్తోంది. సంబరాలు చేసుకుంటోంది” అని ఒక ఆఫ్ఘాన్ నెటిజన్ ట్వీట్ చేశాడు.  పాకిస్థాన్ పతనమే నా సంతోషం అని మరో ఆఫ్డాన్ ట్వీట్ చేశాడు.