
మెదక్ (శివ్వంపేట), వెలుగు : రోడ్డు వేయాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదుల్లాపూర్ చౌరస్తా నుంచి ఉసిరిక పల్లి, శంకర్ తండా, పాంబండ, పోతుల గూడ గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోందని తెలిపారు. అడుగడుగునా గుంతలు ఉండటంతో బైకులు స్కిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
రోడ్డు బాగా లేక బస్సు రద్దు కాగా ఆటోలు కూడా రావడం లేదన్నారు. దీంతో స్కూల్, కాలేజీలకు వెళ్లే స్టూడెట్స్ ఐదు కిలోమీటర్ల దూరం నడుచు కుంటూ వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.