ప్రజలు అలర్ట్‌‌గా ఉండాలి : ఎల్ సుబ్బరాయుడు

కరీంనగర్‌‌క్రైం, వెలుగు:  భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, లోతట్టు ప్రాంతాలకు చెందిన  ప్రజలకు సాయం చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు  లేదా  డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 8712670744లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నాం

గోదావరిఖని: భారీ వర్షాల దృష్ట్యా రామగుండం పోలీస్‌‌‌‌ కమిషనరేట్ పరిధిలోని  ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సీపీ రెమా రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున కమిషనరేట్ పరిధిలోని డ్యామ్‌‌‌‌లు, పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నామని చెప్పారు. 

జగిత్యాల టౌన్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎస్పీ భాస్కర్ సూచించారు. బుధవారం వర్ష ప్రభావిత ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సారంగాపూర్ పోలీస్ స్టేషన్‌‌ను తనిఖీ చేశారు.