కాంగ్రెస్​లో చేరికలు

పర్వతగిరి/ నల్లబెల్లి, వెలుగు : వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం పర్వతగిరిలో పలు పార్టీల నుంచి యువకులు కాంగ్రెస్ లో చేరగా, వారికి ఎమ్మెల్యే నాగరాజు కండువా కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  నల్లబెల్లి మండలం నల్లబెల్లి,నారక్కపేట, రంగాపూరం, పంతులుపల్లి, గొల్లపల్లి గ్రామాలకు చెందిన బీఆర్​ఎస్​పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ కండువాలు కప్పుకొన్నారు.