ప్రైవేట్​లో ఫీజులు దందా...

పెద్దపల్లి,వెలుగు: పెద్దపల్లి జిల్లా ప్రజలకు గవర్నమెంట్​డయాగ్నోస్టిక్​సేవలు అందడంలేదు. గత ఏడాది హాస్పిటల్​క్యాంపస్​లో డయాగ్నోస్టిక్​సెంటర్​భవనం కోసం రూ.1.05  కోట్లు కేటాయించారు. పరికరాల కొనుగోలు కోసం రూ. 50 లక్షలు మంజూరు చేశారు. ఏడాదిగా డయాగ్నోస్టిక్​సెంటర్​భవన పనులు ముందుకు సాగడంలేదు. దీంతో చాలామంది పేదలు ప్రైవేట్​ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా సెంటర్ల నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు ఫీజులు గుంజుతున్నారు. ప్రభుత్వ సెంటర్ అందుబాటులోకి వస్తే 57 రకాల పరీక్షలు పేదలకు ఫ్రీగా అందే అవకాశం ఉంది. అయినా పాలకులు, ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. సర్ది అయినా.. జ్వరం వచ్చినా డాక్టర్లు రక్త, మూత్ర పరీక్షలకు రెఫర్​చేస్తున్నారు. దీంతో చాలామంది పేదలు ప్రైవేట్​సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. వేలలో ఫీజులు చెల్లించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. 

ప్రైవేట్​లో ఫీజులు దందా...

కరోనా తర్వాత డయాగ్నోస్టిక్​ సెంటర్ల అవసరం ఎక్కువైంది. రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వివిధ టెస్టుల పేరు మీద రూ. వేలు దండుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు గోదావరిఖని, మంథనిలో ప్రైవేటు డయాగ్నోస్టిక్​ సెంటర్లు ఏర్పాటు చేసుకొని రోగుల నుంచి టెస్టుల పేరుతో అధిక మొత్తం గుంజుతున్నారు. దీంతో పేద రోగులు వైద్యానికి దూరమవుతున్నారు. కరోనా కాలంలో చాలా మంది టెస్టులు చేయించుకోలేక, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఆధునిక పరికరాలతో డయాగ్నోస్టిక్​ సెంటర్​ ఏర్పాటుకు సర్కార్​ ఆమోదం తెలిపినా, ప్రజలకు అందుబాటులోకి రావడానికి చాల టైం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత నిర్మాణం చూస్తే తెలుస్తుంది.

రోగ నిర్ధారణ ఈజీ

డయాగ్నోస్టిక్ సెంటర్​ స్టార్ట్​ అయితే రోగ నిర్ధారణ ఈజీ అవుతుంది. టెస్టుల కోసం ప్రైవేట్, ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. తొందర్లోనే డయాగ్నోస్టిక్​ సెంటర్​ను అందుబాటులోకి తెస్తాం. 24 గంటల్లో టెస్టు వివరాలు హాస్పిటళ్లకు పంపే అవకాశం ఉంటుంది. దీంతో ట్రీట్మెంట్​ఈజీ అవతుంది.    - డాక్టర్  శ్రీధర్​, డీసీహెచ్​, పెద్దపల్లి