![గుమ్మడిదలలో 12 రోజుకు చేరిన నిరసన](https://static.v6velugu.com/uploads/2025/02/people-protest-against-dump-yard-in-pyaranagar-has-reached-12-days_z16DFH9OTk.jpg)
- డంప్‌యార్డు ముట్టడి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఆదివారం 12 రోజుకు చేరుకున్నాయి. గుమ్మడిదలలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన రిలే దీక్షలో అంబేడ్కర్యువజన సంఘం పాల్గొని మద్దతు తెలిపింది. గుమ్మడిదల నుంచి అన్నారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చలో డంప్ యార్డు అంటూ మహిళలు, యువకులు ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.