నెట్వర్క్, వెలుగు: ఇండ్లు లేని వారిని నిరుపేదలుగా గుర్తించి అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా లీడర్లు డిమాండ్‌చేశారు. గురువారం ఉమ్మడి జిల్లాలో మోపాల్, ఎడపల్లి, నందిపేట, ఆర్మూర్, నవీపేటలో పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంథా రాష్ట్ర , జిల్లా లీడర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ‘డబుల్’ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి 9 ఏండ్లు గడుస్తున్నా నెరవేర్చడం లేదన్నారు.
ఇప్పుడు కొత్తగా స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు ఇస్తామంటు మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం బూటకపు వాగ్ధానాలను ప్రజలు ఎండగట్టాలన్నారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజాపంథా జిల్లా నాయకుడు సాయాగౌడ్, గుమ్ముల గంగాధర్, జిల్లా సహాయ కార్యదర్శి వి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ‘డబుల్’ ఇండ్లు పంచాలి
బోధన్,వెలుగు: పట్టణంలోని పేదలకు ‘డబుల్’ ఇండ్లు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ లీడర్లు ఆర్డీవో ఆఫీస్ఎదుట గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వం, ఎమ్మెల్యే షకీల్ డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి 9 ఏండ్లు పూర్తవుతున్నా.. నేటికీ ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందించారు. లీడర్లు రిజ్వాన్, ఇనాయత్, అలీ తదితరులు పాల్గొన్నారు.