కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించిన బాధితులు 

 

  •     కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో గద్వాల–కర్నూల్ రోడ్డుపై ధర్నా
  •     నర్సింగ్ కాలేజీ మరోదగ్గర కట్టాలని సూచన
  •     ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ 
  •     మద్దతిచ్చిన బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు

గద్వాల, వెలుగు: గత సర్కారు ఇచ్చిన ఇండ్ల  జాగాల జోలికొస్తే ఊరుకునేది లేదని బాధితులు హెచ్చరించారు.  ఆదివారం మున్సిపల్ ఆఫీసర్లు నర్సింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీ నిర్మాణం కోసం దర్పల్లి శివారులో గత సర్కారు ఇచ్చిన ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించిన విషయం తెలిసిందే.  దీంతో ఆఫీసర్ల తీరుకు నిరసనగా సోమవారం బాధితులు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నాకు దిగారు.  వీరికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ లీడర్లు మద్దతిచ్చారు.  ఎమ్మెల్యే కావాలనే తమ జాగాలు గుంజుకుంటున్నారని వెంటనే ఆయన రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి తమ సమస్య పరిష్కరించేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు.  దాదాపు 3 గంటల తర్వాత కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఏవో మదన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ వచ్చి వినతి పత్రం స్వీకరించారు. ఆగ్రహించిన బాధితులు గద్వాల–కర్నూల్‌‌‌‌‌‌‌‌ రోడ్డుపై మెరుపు ధర్నాకు 
దిగారు. 

ట్రాఫిక్ జామ్
బాధితులు గద్వాల–కర్నూల్‌‌‌‌‌‌‌‌ రోడ్డుపై అరగంటకు పైగానే బైఠాయించడంతో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఎక్కడి  వెహికల్స్ అక్కడే నిలిచిపోవడంతో  సీఐ ఎస్‌‌‌‌‌‌‌‌ఎం పాషా అక్కడికి చేరుకొని కలెక్టర్ మాట్లాడిస్తానని  నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అరగంట అయినా కలెక్టర్ బయటకు రాకపోవడంతో మళ్లీ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, ఆఫీసర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఆ తర్వాత డీఎస్పీ రంగస్వామి వచ్చి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా అసిస్టెంట్ కలెక్టర్ రఘురామ శర్మ వచ్చి వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. న్యాయం చేస్తామని చెప్పి వెళ్లిపోయారు.  స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఊరుకునేది లేదని,   రేపటి నుంచి  ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. 

పేదలకు చేసిందేంది?
టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  అధికారంలో వచ్చి పేదలకు చేసిందేందని ప్రతిపక్ష లీడర్లు ప్రశ్నించారు.  ఒక్కరికి కూడా సెంట్‌‌‌‌‌‌‌‌ జాగా,  డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని సర్కారు గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇండ్ల జాగాలను గుంజుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి  కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పేదలమీద ప్రేమ ఉంటే  ఇల్లు కట్టించి ఇవ్వాలని, కనీసం లోన్‌‌‌‌‌‌‌‌ అయినా మంజూరు చేయాలని కోరారు.  పేదలజోలికొస్తే ఊరుకునేదిలేని, ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు.  బీజేపీ నేతలు  బండల పద్మావతి, రామాంజనేయులు, వెంకట్ రాములు, రజక జయ శ్రీ, టిటిసి నరసింహ, పులిపాటి వెంకటేష్, జీఎల్ చందు , కాంగ్రెస్  జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ శంకర్, ఇసాక్  పాల్గొన్నారు.

ఇదీ కథ
2012లో డీకే అరుణ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న టైమ్‌‌‌‌‌‌‌‌లో దౌదర్పల్లి శివారులో 30 ఎకరాల్లో దాదాపు 1500 మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు.  ఇందులో కొందరు ఇండ్లు కట్టుకోగా... మిగతా వారు డబ్బుల్లేక అలాగే ఉంచారు. ప్రస్తుతం అవి వారి ఆధీనంలోనే ఉన్నాయి.  అయితే  టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కారు ఇటీవల గద్వాలకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఇందుకోసం గతంలో సర్కారు పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాన్ని ఎంపిక చేయడంతో వివాదం మొదలైంది. ప్రపోజల్ పెట్టినప్పటి నుంచే బాధితులు, ప్రతిపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారు. నర్సింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీ, హాస్పిటల్ మరోచోట కట్టాలని సూచిస్తున్నారు. 

మా పొట్టగొట్టొద్దు
మా పొట్టగొడ్తే పుట్టగతులుండవ్. గవర్నమెంట్ ఇచ్చిన జాగాలో గుడిసెలు వేసుకుందామనుకుంటే సర్కారు గుంజుకుంటున్నది.  కొందరు ఈ పట్టాలను ఆడపిల్లలకు పసుపు కుంకుమ కింద రాసి ఇచ్చిన్రు. ఇప్పుడు వారి పరిస్థితి ఏం కావాలె. నర్సింగ్ కాలేజీ ఇంకోతాన కట్టుకోండి సారూ.
- రాధా బాయ్, బాధితురాలు