తల్లాడ, వెలుగు : తల్లాడలోని ఫారెస్ట్ ఆఫీసర్ ఏరియా1వ వార్డులో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై ఆదివారం వార్డులోని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం రోజులుగా తాగేందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈలప్రోలు నాగమణి, బొడ్డు జయ, సిరిగి నాగేశ్వరి, బీరెల్లి లక్ష్మి, గుల్ ఫర్, అఖిల, తదితరులు పాల్గొన్నారు.