బీఆర్ఎస్​తో బీఎస్పీ కలవడాన్ని వ్యతిరేకిస్తున్నాం : బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోసం బీఆర్​ఎస్​పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం దురదృష్టకరమని సిర్పూర్​లోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్పను ఓడించేందుకు కంకణం కట్టుకొని వచ్చిన ఆర్​ఎస్ ​ప్రవీణ్ ​కుమార్​ను అక్కున చేర్చుకోవడం సిర్పూర్ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ అధిష్ఠానం బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడంపై బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా కోనేరు కోనప్ప అనుచరులు మీటింగులు ఏర్పాటు చేసుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తమ నేత కోనేరు కోనప్ప  ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.