సిరికొండ, వెలుగు: కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యమని రూరల్ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గడ్కోల్‌లో కప్పలవాగుపై రూ.12 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలతో ప్రతీ ఒక్కరికి లబ్ధి చేకూరుతోందన్నారు. గడ్కోల్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తన గెలుపుకోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కార్యదర్శి వెలమ భాస్కర్‌రెడ్డి, కుందేళ్ల శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, ఎర్రన్న పాల్గొన్నారు.
వాడి బ్రిడ్జి పనులకు శంకుస్థాపన
ధర్పల్లి: రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం వాడి లో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ. 9.50 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. వానాకాలంలో వరదల కారణంగా లో లెవల్బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు ఆటంకం కలుగుతుండడంతో హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయితే బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించే వారికి తిప్పలు తప్పుతాయన్నారు. వాడి సర్పంచి గంగవ్వ, మండలాధ్యక్షుడు ఆర్మూర్చిన్న బాలరాజు, లీడర్లు శ్రీనివాస్, బొర్రన్న, లింబ్యా నాయక్‌పాల్గొన్నారు.
డిచ్పల్లి, ఇందల్వాయి: డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు హైలెవల్ బ్రిడ్జిలకు రూరల్ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలం నడిపల్లి వద్ద, ఇందల్వాయి మండలం వెంగల్పాడ్, లింగాపూర్వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. భూపతిరెడ్డి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.