రోడ్డుపై వజ్రాలు దొరుకుతున్నాయ్. కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు రోడ్డుపై లభిస్తున్నాయ్. అవునండీ..ఇది నిజం. రోడ్డుపై వజ్రాలు ఉన్నాయన్న సంగతి తెలిసిన వెంటనే ఆ ప్రాంతమంతా జనంతో రద్దీగా మారింది. నిర్మానుశ్యంగా ఉండే రోడ్డుపై ఒక్కసారిగా ఇసుకేస్తే రాలనంతా జనం గుమిగూడారు. వజ్రాల కోసం రోడ్డుపై దుమ్ము, దూళిని జల్లెడ పట్టారు. ఇంతలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. అతని ఆనందానికి అవధుల్లేవు. నాకు వజ్రం దొరికిందోచ్ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో అక్కడున్న వారంతా మరింత ఆసక్తితో వజ్రాల వేట ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే..
రోడ్డుపై వజ్రాల ప్యాకెట్..
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఓ వ్యాపారి వజ్రాలను పోగొట్టుకున్నాడు. సూరత్ లోని వజ్రాల వ్యాపారానికి కేంద్రమైన వరచ్చా ప్రాంతంలో ఈ వ్యాపారి వజ్రాల ప్యాకెట్ పడేసుకున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ వార్త నిమిషాల వ్యవధిలో సూరత్ మొత్తం వ్యాపించింది. అంతే..ఒక్కసారిగా జనం అంతా వరచ్చా ప్రాంతానికి చేరుకున్నారు. వజ్రాల కోసం ప్రతీ అంగుళాన్ని జల్లెడ పట్టారు. కొందరైతే రోడ్డుపై ఉన్న దుమ్మును కూడా వదిలిపెట్టలేదు. దాన్ని చేతిలో వేసుకుని..వెతికారు. ఇలా వజ్రాల కోసం జనం వెతుకుతున్న వీడియో వైరల్ అయింది.
Also Read :- ఆర్మీ జవాన్‌పై దాడి, వీపుపై పీఎఫ్ఐ ముద్ర
దొరికింది వజ్రం..
ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. చాలా సేపు వెతకగా..అతనికి వజ్రం దొరికింది. అతని ఆనందానికి అవధుల్లేవ్. నాకు వజ్రం దొరికిందోచ్..నాకు వజ్రం దొరికిందోచ్ అంటూ సంబరాలు చేసుకున్నాడు. అతని సంబరాలకు మిగతా జనం మరింత ఆసక్తి కనభర్చారు. మరింత ఉత్సాహంతో వజ్రాలను వెతికారు.
#સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ.
— ??????? ? ????????? ??? (@KalpeshPraj80) September 24, 2023
પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl
ఇదీ ట్విస్ట్..
వజ్రం దొరికిన వ్యక్తి..అది నిజమైనదా..కాదా అనే సందేహంతో.. జువెల్లరీ షాపు యజమానికి చూపించాడు. జువెల్లరీ షాపు యజమాని సమాధానానికి ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు. ఎందుకంటే అతనికి దొరికిన వజ్రం నకిలీది. ఆ నకిలీ వజ్రాన్ని ఇమిటేషన్ జువెల్లరీ లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని తేల్చడంతో..ఉసూరుమన్నాడు.
నకిలీ వజ్రం అని తేలడంతో..
సూరత్ వరచ్చా ప్రాంతంలో ఓ వ్యాపారి పడేసుకున్న వజ్రాలు..నకిలీవని తేలడంతో జనం నిరాశగా వెనుదిరిగారు. అనవసరంగా టైం వేస్ట్ చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వజ్రాల పడిపోయాన్న వార్త చూసి వచ్చామని..ఎంతో ఆసక్తితో వజ్రాల కోసం వెతికామన్నారు. తీరా వజ్రాలు నకిలీవని తేలిందని బాధపడ్డారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందని చెప్పుకొచ్చారు.