మెదక్టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్కలెక్టర్రమేశ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అర్హులైన వారికి లోన్లు మంజూరు చేయాలన్నారు.
ఎంపికైనవారికి వారం రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి , ఎంఎస్ఎంఈ ఏడీ దశరథ్, డీపీవో యాదయ్య, మెప్మా పీడీ ఇందిర, ఎల్డీఎం నర్సింహమూర్తి పాల్గొన్నారు.