వైకుంఠధామాల్లో సౌలత్​ల కరువు

వైకుంఠధామాల్లో  సౌలత్​ల కరువు
  •     పవర్​ సప్లై ఉండదు.. నీళ్లు ఉండవు 
  •     జీపీల్లో నిధుల్లేక  మెయింటనెన్స్​లో నిర్లక్ష్యం
  •     సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్న జనం 

పెద్దపల్లి, వెలుగు: గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాల్లో సౌకర్యాలు లేక అంత్యక్రియలు చేసేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలకు పనికి రాకుండా పోతున్నాయి. కొన్ని వైకుంఠధామాలు చెరువు శిఖం భూముల్లో నిర్మించగా.. మరికొన్ని అసంపూర్తి నిర్మాణాలతో శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు జనం వెనుకాడుతున్నారు. గత సర్కార్​పెద్దపల్లి జిల్లాలో 265 గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో ఒక్కోదానికి రూ. 12 లక్షల చొప్పున వైకుంఠధామాలను నిర్మించింది. కానీ ప్రజలకు ఎంత వరకు అందుబాటులో ఉంటున్నాయో పట్టించుకోలేదు. నిర్మాణం పూర్తయినా చాలాచోట్ల వాడుకలోకి తీసుకురాలేదు.

జిల్లాలో దాదాపు 50 వైకుంఠధామాలు వానాకాలం వరదలకు మునుగుతున్నాయి. వరద వస్తే మునుగుతాయని తెలిసినా నాటి ఆఫీసర్లు పట్టించుకోకుండా కమీషన్ల కోసం, కాంట్రాక్టర్లను బతికించడం కోసమే వైకుంఠధామాలు నిర్మించారన్న ఆరోపణలున్నాయి. సరైన మెయింటనెన్స్​ లేకపోవడంతో చాలా గ్రామాల్లో కూలిపోయే స్థితిలోకి వచ్చాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో వైకుంఠధామాల్లో దహన సంస్కారాలు చేయకుండా పాత శ్మశానాలు, పొలాలు, ఇతర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, జీపీల్లో నిధులు లేకపోవడం లాంటి కారణాలతో వైకుంఠధామాలు నిరుపయోగంగా మారుతున్నాయి. వైకుంఠధామాలకు జీపీల నుంచే కరెంట్, వాటర్​ కల్పించుకునేలా ఆనాటి సర్కార్​ నిర్ణయించింది. జీపీలకు వచ్చే అరకొర నిధుల నుంచి వైకుంఠధామాలకు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు.