
US News: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్ఆర్ఐలు వణికిపోతున్నారు. ప్రధానంగా గ్రీన్ కార్డ్ హోల్డర్ల నుంచి H-1B వీసా, F-1 వీసాలపై ఉన్న అనేక మంది ఆందోళన చెందేలా పరిస్థితులు రోజురోజుకూ మారిపోతున్నాయి. గడచిన కొన్ని వారాలుగా దీనికి తగినట్లుగానే అమెరికా వలస విధానానికి సంబంధించిన రూల్స్ కూడా మారిపోతున్నాయి. ఈ క్రమంలో వివిధ వీసా హోల్డర్లకు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నుంచి ట్రావెల్ రిస్క్ అడ్వైజరీ బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో యూఎస్ వైస్ ప్రెసిడెండ్ జేడీ వాన్స్ ఇటీవల స్పందించారు. వాస్తవానికి ఒక గ్రీన్ కార్డు అమెరికాలో నివసిస్తున్న ప్రవాసులకు జీవితకాలం నివాసానికి అనుమతిని అందించబోదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్ఆర్ఐలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనికి తగినట్లుగానే గ్రీన్ కార్డు నుంచి హెచ్ వన్ బి వీసాల వరకు అన్నింటికి సంబంధించిన రూల్స్ కూడా మార్చబడుతున్న సంగతి తెలిసిందే. దీనిని చూస్తుంటే ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చర్యలు చెబుతున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులు, చొరబాటుదారులను తమ దేశాలకు తిప్పి పంపుతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు లీగర్ ఇమ్మిగ్రెంట్ల విషయంలోనూ కఠినత్వాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ ఏజెన్సీలు అమెరికాలోకి ఎవరు వస్తున్నారు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు దేశాన్ని విడిచిపెడుతున్నారు, ఏ మార్గాల్లో వారు అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు వంటి అనేక కీలక అంశాలను సదరు అధికారిక వర్గాలు సేకరిస్తున్నాయి.
వాస్తవానికి అమెరికాలో ప్రధానంగా వలసదారుల్లో ఇండియన్స్ కూడా ఒకరు. భారతదేశం నుంచి ఏటా అనేక్ మంది యూఎస్ వెళ్లటానికి అప్లై చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే భారతీయులు లక్షల సంఖ్యలో అమెరికాలో ఉద్యోగ, విద్యా వంటి అవసరాలతో నివసిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న ప్రవాస భారతీయులు మాత్రం ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మారుతున్న పరిస్థితులను నిశితంగా ఓపికతో పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది.
Also Read:-నేడు కుప్పకూలిన బంగారం ధర..
వాస్తవానికి ట్రంప్ 43 వివిధ దేశాల నుంచి ఇమ్మిగ్రెంట్లను అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించిన నాటి నుంచి వివిధ ఏజెన్సీలు ఎంట్రీ పాయింట్లను నిశితంగా పరిశీలిస్తున్నాయి. భారతదేశానికి పక్కనే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ వంటి దేశాలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన సంగతి తెలిసిందే. చట్టాన్ని పాటించే భారతీయులను మాత్రం ట్రావెల్ బ్యాన్ లిస్టులో ట్రంప్ సర్కార్ చేర్చకపోవటం లక్షల మంది ప్రవాస అమెరికన్లకు ఊరటను కలిగిస్తున్న పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు.
అమెరికా వెళ్లేవారు తప్పకుండా కలిగి ఉండాల్సిన వివిధ డాక్యుమెంట్ల జాబితా-
1. భారతదేశానికి చెందిన పాస్ పోర్టు
2. చెల్లుబాటు అయ్యే గ్రీన్ కార్డు
3. చెల్లుబాటు అయ్యే H-1B వీసా, F-1 వీసా
4. అమెరికాలోకి తిరిగి ప్రవేశించటానికి అనుమతి పత్రం
5. ఉద్యోగ స్థితి వెరిఫికేషన్ లెటర్
6. అమెకాలో పన్నులు చెల్లిస్తున్నట్లు గడచిన ఏడాది కాలానికి సంబంధించిన ఫెడరల్ ఇన్కమ్ టాక్స్ పత్రాలు
7. చివరి మూడు నెలలకు సంబంధించిన ఆదాయపు రుజువు లేదా పేస్లిప్
8. విద్యార్థులకు చెల్లుబాటు అయ్యే యూనివల్సిటీ లేదా కాలేజీ నుంచి లెటర్
9. అమెరికాలోని ఏదైనా బ్యాంకులో కలిగి ఉన్న అకౌంట్ వివరాలు
10. అమెరికా డ్రైవింగ్ లైసెన్సు