
భారత్ వంట గ్యాస్ కోసం ప్రజలు చెప్పులతో క్యూలైన్ కట్టారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని వెంకటరమణ భారత్ వంట గ్యాస్ ఏజెన్సీ డిసెంబర్ 18వ తేదీ సోమవారం ప్రజలు భారీగా క్యూలైన్ లో బారులు తీరారు. ఈ కేవైసీ కోసం ఈరోజు ఉదయం 7 గంటల నుండి క్యూ లైన్ లో చెప్పులుపెట్టి పడి గాపులు కాస్తున్నారు.
ఈ కేవైసీ చేసుకుంటేనే 400 రూపాయలకు వంట గ్యాస్ ఇస్తారని ప్రచారం జరగడం.. ఈ కేవైసీకి ఈనెల ఆఖరి రోజు అనడంతో ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీ సెంటర్ వద్దకు భారీగా జనాలు తరలివస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకునేందుకు తమ పనులను వదిలిపెట్టుకొని చలి కూడా లెక్కచేయకుండా వచ్చి క్యూ లైన్ లో చెప్పులు పెట్టి నిలబడుతున్నారు.