వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి : చాడ వెంకట్ రెడ్డి

వేములవాడ, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు కాదని, ప్రజలు గెలవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం వేములవాడలోని మహా లింగేశ్వర గార్డెన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌‌‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సారి తెలంగాణలో సైలెంట్​ఓటింగ్​జరగబోతోందని, అధికార పార్టీ లీడర్లు ఒకవైపు.. ప్రజలంతా ఒకవైపు ఉన్నారన్నారు.

రాష్ట్రంలో కుటుంబ, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణలో సీపీఐ కాంగ్రెస్​కు ​మద్దతిస్తోందన్నారు.  రూ.వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం(మేడిగడ్డ) నాలుగేండ్లకే కుంగిపోయిందన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం కూడా కుంగిపోతుందన్నారు. వేములవాడలో కాంగ్రెస్​అభ్యర్థి ఆది శ్రీనివాస్‌‌‌‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.  

కేసీఆర్​ రైతులనునిండా ముంచిండు.. 

రైతులను నిలువుదోపిడీ చేస్తున్న కేసీఆర్ సర్కార్‌‌‌‌‌‌‌‌కు బుద్ధి చెప్పాలని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం కథలపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగు సార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నానని, ఈసారి తనను గెలిపించాలని కోరారు. 

కాంగ్రెస్‌‌‌‌కు ఒక్క చాన్స్​ఇవ్వండి 

జగిత్యాల, వెలుగు: తెలంగాణలో నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన చేస్తోన్న బీఆర్ఎస్‌‌‌‌ను గద్దె దించడమే లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీపీఐ లీడర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆత్మ గౌరవం కోసం సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మవంచనతో కూడిన పాలన సాగుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌కు ఒక్కసారి చాన్స్​ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్​ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదన్నారు. ప్రశ్నించే గొంతుకగా ఉన్న జీవన్‌‌‌‌రెడ్డిని  గెలిపించాలని చాడ కోరారు.