ఆర్టీసీ బస్సు ప్రమాదం..23 మందికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు ప్రమాదం..23 మందికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 23 మంది గాయపడ్డ సంఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ములకలపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు పనిచేయకపోవడంతోనే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహారించి చెట్టుకు ఢికొట్టినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.