ములుగు జిల్లాలో హుండీ ఎత్తుకెళ్లిన  వ్యక్తులు అరెస్ట్‌‌

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం సాయిబాబా గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన వారిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఎస్సై రవికుమార్‌‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నిమ్మల వినయ్‌‌కుమార్‌‌, ఇటుకల నిఖిల్‌‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు కలిసి 10 రోజుల కింద కమలాపురం సాయిబాబా గుడిలో హుండీ ఎత్తుకెళ్లారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌‌ చేశారు. నిందితులు ఆదివారం కమలాపురంలోని విలేజ్‌‌ పార్కు వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి హుండీ, రూ. 18,880, బజాజ్‌‌ డిస్కవరీ, బైక్‌‌, 22 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవికుమార్‌‌ తెలిపారు.