- స్కూటీలు పంపిణీ చేసిన కలెక్టర్
నిర్మల్, వెలుగు: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీఓస్ భవన్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 8 మందికి స్కూటీలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓవై పి.రమేశ్, సీడీపీఓలు నాగమణి, స్వాతి, మూర్తి, మధుసూదన్ రెడ్డి, సగం రాజు, దివ్యాంగ వ్యవస్థాపక అధ్యక్షుడు సట్టి సాయన్న, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.