Women Beauty: ఆయిలీ స్కిన్నా? అయితే హ్యాపీ

Women Beauty: ఆయిలీ స్కిన్నా? అయితే హ్యాపీ

అలా ముఖం కడుక్కుంటే.. ఇలా జిడ్డుగా మారిపోతోందని విసుక్కునేవాళ్ళు రోజూ తలస్నానం చేసినా.. జుట్టంతా జిడ్డుపట్టినట్లుగా కనిపిస్తోందని బెంగ పడేవాళ్ళు ఆయిలీ స్కిన్ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా సమస్య పరిష్కారం కాక బాధపడేవాళ్ళు.. నిజానికి అదృష్టవంతులు. పొడిచర్మం ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్ళకే బెనిఫిట్స్ ఎక్కువ. అవేంటంటే.. 

• పొడి చర్మం ఉన్నవాళ్లతో పోలిస్తే జిడ్డు చర్మం ఉన్న వాళ్లు వయసైనట్టు కనిపించరు. 
• ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ల ముఖంపై ముడతలు, గీతలు త్వరగా రావు.
 • ఆయిలీ స్కిన్ ఎక్కువ సమయం మెరుస్తున్నట్టు సహజంగా కనిపిస్తుంది. అదే పొడి చర్మమైతే పాలిపోయినట్టు అయిపోతుంది. 
• ఆయిలీ స్కిన్ మృదువుగా ఉంటుంది. ఎందుకంటే.. మనకు జిడ్డు అనిపించే దంతా చర్మం విడుదల చేసిన నూనెలాంటి పదార్థమే. సహజంగా ఉత్పత్తి అయ్యే ఆ నూనె వల్ల చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. 
• ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు మృదువైన చర్మం కోసం ప్రత్యేకంగా క్రీములు రాయాల్సిన అవసరం ఉండదు. 
• ఆయిలీ స్కిన్ ఉంటే మేకప్ కోసం ఫౌండేషన్లు వంటివి పూయాల్సిన అవసరం కూడా ఉండదు. 
• స్కిన్ మరీ ఆయిలీగా ఉంటే చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చాలు మళ్లీ తాజాగా కనిపిస్తారు.