జనం డౌట్స్ ఇవే.. గూగుల్ లో ఎక్కువగా వెతికింది వీటి కోసమే..

జనం డౌట్స్ ఇవే.. గూగుల్ లో ఎక్కువగా వెతికింది వీటి కోసమే..

గూగుల్.. ఏ విషయం తెలుసుకోవాలన్నా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి వెళ్లాల్సిందే. గూగుల్ లేనిదే ఇప్పుడు పని అవడం లేదు. అవును మరీ.. కొత్తకొత్త విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న గూగుల్ ఇంటర్నెట్ వినియోగించడం తెలిసిన ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగమై పోయింది. అయితే గూగుల్ ప్రతి ఏడాది చివరన తన సెర్చ్ ఇంజిన్ పనితీరు, కస్టమర్లు ఎక్కువగా వెదికిన అంశాలు గురించి కీలక విషయాలను తెలియజేస్తుంది. ఈ ఏడాది అంటే 2023 ఎండింగ్ లో కూడా గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన అంశాలపై లిస్ట్ విడుదల చేసింది.

గూగుల్ విడుదల చేసిన లిస్ట్ లో ట్రెండింగ్ టాపిక్ నుంచి జనాదరణ పొందిన వీడియోల వరకు అన్నీ ఉన్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ లాండింగ్ నుంచి కర్ణాటక ఎన్నికలు, G20సమ్మిట్ రాజకీయ సంఘటనలపై ఈ ఏడాది (2023) లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు క్రికెట్ ప్రపంచ కప్ అప్ డేట్స్ వెదికేందుకు ఎక్కువ మంది ప్రత్యేకించి ఆసక్తి చూపారు. 

Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన అంశాలు: 

2023లో భారత్ లో అత్యధికంగా శోధించిన అంశాలకు సంబంధించిన 12జాబితాలను Google ఇటీవల షేర్ చేసింది. ఇందులో  వార్తల ఈవెంట్ నుంచి ఎలా అడగాలి అనే ప్రశ్నల వరకు ప్రతిదీ కవర్ చేస్తుంది. ప్రతి వర్గంలోని టాప్ 5 సెర్చింగ్ లను చూద్దాం. 

టాప్ 5 వార్తల ఈవెంట్లు

  • చంద్రయాన్ 3 
  • కర్ణాకట ఎన్నికల ఫలితాలు
  • ఇజ్రాయెల్ వార్తలు
  • సతీష్ కౌశిక్
  • బడ్జెట్ 2023 వంటి వార్త అంశాలకు సంబంధించి గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేశారు.

వాట్ ఈజ్ టాప్ 5  సెర్చింగ్స్ : 

  • G20  అంటే ఏమిటి 
  • UGC  అంటే ఏమిటి 
  • ChatGPT అంటే ఏమిటి 
  • హమాస్ అంటే ఏమిటి 
  • 28 సెప్టెంబర్ 2023 న ఏమిటి 

2023 ‘హౌటు’ టాప్ 5 సెర్చింగ్స్ :

  • హోం రెమిడీస్ తో చర్మం, జుట్టుకు సన్ డ్యామేజ్ ను ఎలా నివారించాలి 
  • Youtube లో నా మొదటి 5K అనుచరులను ఎలా తెలుసుకోవాలి 
  • కబడ్డీలో రాణించటం ఎలా 
  • కారు మైలేజీని ఎలా మెరుగుపరచాలి 
  • చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎలా మారాలి 

స్పోర్ట్స్ ఫ్రెంజ్: 2023లో స్పోర్ట్స్ లో టాప్ 5 సెర్చ్ లు: 

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • క్రికెట్ ప్రపంచకప్ 
  • ఆసియా కప్ 
  • మహిళల ప్రీమియర్ లీగ్ 
  • ఆసియా క్రీడలు 

నియర్ అండ్ డియర్ : 2023 నా దగ్గర(Near Me) లో.. టాప్ 5 సెర్చ్ లు :

  • నా దగ్గర కోడింగ్ క్లాసులు
  • నా దగ్గర భూకంపం 
  • నాకు సమీపంలోని యూనిట్లు
  • నా దగ్గర ఓనమ్ సధ్య 
  • నా దగ్గర జైలర్ సినిమా