గణపతి పండుగ వచ్చింది..మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి..ఊరంగా ఎక్కడ చూసిన నీళ్లే..గణేషుని మండపం ఎక్కడ వేయాలి..రానున్న రోజుల్లో కూడా వర్షాలున్నాయి..గణేషుని పూజ నిర్వహణ తదితర కార్యక్రమాలు ఎలా సాగాలి..అనే సందేహాల మధ్య మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మురుమూరు గ్రామానికి చెందిన యూత్..
అనుకున్నదే ఆలస్యం..గణేషుని ప్రతిష్టించేందుకు వారికి ఓ ప్లేస్ గుర్తుకు వచ్చింది.. అదే.. ఊర్లో కామన్ గా ఉన్న వాటర్ ట్యాంక్.. ఇక్కడైతే గణేషును పూజకు ఏ వర్షాలు ఆటంకం కలిగించవు అని నిర్ధారించుకుని రంగంలో కి దిగారు.. వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏకంగా మంచి సెటప్ ఏర్పాటు చేసి విఘ్నేషుని ప్రతిష్టించారు.
వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ లో సెంట్రింగ్ కొట్టించారు.. మెట్లు కూడా ఏర్పాటు చేశారు.
భక్తులు వచ్చి గణనాధునికి పూజలు చేసి.. ఆశీర్వాదం తీసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు.. ఇక కాలక్షేపానికి ఓ డీజే సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. విఘ్నేషుని మండల సెటప్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు యూత్ చేసిన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్తూ.. తెగ కామెంట్లు పెగుతున్నారు..