- పెప్సికో, యూనిలీవర్, నెస్లేపై ఏటీఎన్‌ఐ రిపోర్ట్
న్యూఢిల్లీ : పెప్సికో, యూనిలీవర్, నెస్లే వంటి 30 కంపెనీలు ఇండియా వంటి తక్కువ ఆదాయ దేశాల్లో లెస్ హెల్తీ ప్రొడక్ట్‌లు అంటే హెల్త్ రేటింగ్ సిస్టమ్‌లో తక్కువ స్కోర్ పొందిన ప్రొడక్ట్‌లను అమ్ముతున్నాయని యాక్సెస్ టూ నూట్రిషన్ ఇనీషియేటివ్ (ఏటీఎన్‌ఐ) రిపోర్ట్ పేర్కొంది. ఇటువంటి ప్రొడక్ట్‌లతో ప్రజల ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం పడుతుందని తెలిపింది. హెల్త్ రేటింగ్ సిస్టమ్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో డెవలప్ చేశారు. కొన్ని కంపెనీలు తక్కువ ఆదాయ దేశాల్లో అమ్మే ప్రొడక్ట్‌ల రేటింగ్ హెల్త్ రేటింగ్ సిస్టమ్‌లో ఐదుకి 1.8 గా ఉంటే
అదే ఎక్కువ ఆదాయ దేశాల్లో ఇవే కంపెనీలు అమ్మే ప్రొడక్ట్‌ల రేటింగ్ ఐదుకి 2.3 గా ఉందని ఏటీఎన్‌ఐ రిపోర్ట్ పేర్కొంది. ఈ హెల్త్ రేటింగ్ సిస్టమ్ ప్రకారం 3.5 కంటే ఎక్కువ రేటింగ్ వస్తే సంబంధిత ప్రొడక్ట్ బాగా ఆరోగ్యకరమైనది. ఇండియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ రేవంత్ హిమత్సింగ్కా నెస్లే అమ్మే సెరెలాక్, కిసాన్ అమ్మే టమోటో కెచప్ వంటివి స్టాండర్డ్స్‌కు తగ్గట్టు లేవని ఆరోపించారు.
కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపచంలోని 100 కోట్లకు పైగా జనాభా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 70 శాతం మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. పొటాటో చిప్స్, కోలా బెవరేజెస్ వంటి స్నాక్స్, ఫాస్ట్‌ఫుడ్స్ ఊబకాయానికి కారణమవుతున్నాయి.