వంద కోట్లలో ఒక గుడ్డు.. వేలంలో రూ.21 వేలు పలికింది.. అంత అరుదైన ఎగ్గా?

వంద కోట్లలో ఒక గుడ్డు.. వేలంలో రూ.21 వేలు పలికింది.. అంత అరుదైన ఎగ్గా?

మీరు చూసింది నిజం. గుడ్డు.. వేలంలో 21 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. ‘‘వన్ ఇన్ బిలియన్’’ అని పిలవబడే ఈ ఎగ్.. 21 (200 పౌండ్లు) వేల ధర పలికిందంటే ఇందులో అంత స్పెషాలిటీ ఏముందబ్బా.. అనుకుంటున్నారా. అయితే చదవండి.

వివరాల్లోకి వెళ్తే.. యూకే (యునైటెడ్ కింగ్ డమ్) లోని లంబౌర్న్ కు చెందిన ఎడ్ పౌనెల్ అనే వ్యక్తి ఈ గుడ్డును వేలంపాటలో సుమారు రూ.16 వేలకు (150 పౌండ్లు) దక్కించుకోవడంతో న్యూస్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. గుడ్డేంటి.. 16 వేలు పలకడమేంటనే డౌట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
అయితే.. కోడి గుడ్లు అన్ని ఎలా ఉంటాయి.. ప్రపంచంలో ఎక్కడైనా గుడ్డు ఆకారం ఒకేలా ఉంటుంది. కానీ ఈ గుడ్డు అలా కాకుండా గుండ్రంగా ఉండటంతో అట్రాక్షన్ గా నిలచింది. 

ALSO READ | Good Health : జింక్తో రోగాలకు చెక్

అయితే పౌనెల్ ఈ గుడ్డును రూ.16 వేలకు ఒక పబ్ లో దక్కించుకున్నాడట. అయితే ఈ ఎగ్గును ఏదైనా మంచి పనికి ఉపయోగించుకుందామనే ఆలోచనతో యువెంటస్ ఫౌండేషన్ వాళ్లకు డొనేట్ చేశాడట. ఈ ఫౌండేషన్ ఆక్స్ఫర్డ్షైర్ లో ఉండే మతిస్థిమితం లేని యువతీ యువకులకు చికిత్స అందించే చారిటీ సంస్థ. 
ఈ గుడ్డును ఉపయోగించి పిల్లలకు ఏదైనా మంచి చేయండని పౌనెల్ ఇవ్వడంతో ఆక్షన్ నిర్వహించాలని భావించిందట ఆ సంస్థ. వచ్చిన డబ్బుతో పిల్లలకు మరింత మెరుగైన చికిత్స అందించవచ్చు అనే ఆలోచనతో వేలంపాట నిర్వహించారట. వేలంపాటలో అత్యధికంగా 21 వేల రూపాయలు రావడంతో గత 13 నుంచి 25 ఏండ్ల మధ్య ఉన్న మానసిక వికలాంగుల చికిత్స కోసం వినియోగిస్తామని చెప్పారు. 

చిన్న గుడ్డే కానీ.. ఎంత అనారోగ్యంతో బాధ పడుతున్న వాళ్ల చికిత్సకు తోడ్పడుతుందంటే మాట్లాడుకోవాల్సిన విషయమే. హై న్యూట్రిషన్స్ తో  విటమిన్స్, మినరల్స్ కలిగి ఉండి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే ఎగ్గు ఇప్పుడు ఏకంగా అంతమంది ఆరోగ్య రక్షణలో తోడ్పడుతుందంటే చూడండి మరి.. ఎగ్గా మజాకా. అందుకే ఈ ఎగ్గును ‘‘వన్ ఇన్ బిలియన్’’ అని పిలుస్తున్నారు.