- అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్
ముషీరాబాద్, వెలుగు : బాగ్‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్స్టూడెంట్లు చదువుతోపాటు ఆటల్లో రాణిస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తైక్వాండో, కబడ్డీ టోర్నమెంట్లలో సత్తా చాటారు. తైక్వాండో అండర్80 కేజీ కేటగిరిలో ఎస్.నితీశ్‌కుమార్ గోల్డ్ మెడల్, ప్రణయ్ సిల్వర్మెడల్, అండర్54 కేజీ కేటగిరిలో బి.గౌరి సిల్వర్ మెడల్, 58 కేజీల విభాగంలో ఎ.పురుషోత్తం బ్రాంజ్‌మెడల్
63 కేజీల కేటగిరి ఓవర్ ఆల్ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయస్థానంలో నిలిచారు. అలాగే ఓయూ ఇంటర్ కాలేజీ కబడ్డీ మెయిన్స్ చాంపియన్ షిప్ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు రసవత్తరంగా జరిగాయి. సెమీఫైనల్ లో అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లు తృతీయ స్థానంలో నిలిచారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అంబేద్కర్ఇనిస్టిట్యూషన్స్కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజావివేక్ బుధవారం సన్మానించారు. మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.