జూన్‌‌లో పుంజుకున్న సర్వీసెస్ సెక్టార్‌‌‌‌

జూన్‌‌లో పుంజుకున్న సర్వీసెస్ సెక్టార్‌‌‌‌

న్యూఢిల్లీ: కిందటి నెలలో సర్వీసెస్ సెక్టార్ పనితీరు మెరుగుపడింది. ఈ ఏడాది మే నెలలో ఐదు నెలలో కనిష్టమైన 60.2 కి  పడిపోయిన హెచ్‌‌ఎస్‌‌బీసీ సర్వీసెస్  పర్చేజింగ్‌‌ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), జూన్‌‌లో కొద్దిగా పెరిగి 60.5 కి చేరుకుంది. సర్వీసెస్ సెక్టార్‌‌‌‌లో  ఉత్పాదకత పెరిగిందని హెచ్‌‌ఎస్‌‌బీసీ చీఫ్ ఎకనామిస్ట్ ప్రంజుల్‌‌ భండారి అన్నారు. 

లోకల్ కంపెనీలకు దేశ, విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లు పెరిగాయని పేర్కొన్నారు. సర్వీసెస్ సెక్టార్ ఉత్పాదకతను కొలిచే హెచ్‌‌ఎస్‌‌బీసీ ఇండియా కాంపోజిట్ ఔట్‌‌పుట్ ఇండెక్స్‌‌ మే నెలలో 60.5 గా ఉంటే జూన్‌‌లో 60.9 కి పెరిగింది.