ఖేలో ఇండియాలో సెపక్‌‌ తక్రాను చేర్చండి

  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి పెరిక సురేశ్ వినతి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఖేలో ఇండియాలో సెపక్ తక్రాను చేర్చాలని సెపక్ తక్రా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిక సురేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఖేలో ఇండియా స్కీమ్ దేశంలో ఎంతో మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. 

సెపక్ తక్రా స్పోర్ట్స్ కోసం రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఖేలో ఇండియా అక్రిడేటెడ్ అకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ఏర్పాటుతో తెలంగాణలో సెపక్ తక్రా క్రీడాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన నూతన అధ్యక్షుడు పెరిక సురేశ్ ను  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్​రాజ్ తదితరులు పాల్గొన్నారు.