- పర్మిషన్ ఇచ్చేందుకు ఆర్టీఏ రెడీ
- ప్రస్తుతం సిటీలో 3 వేల ఎలక్ట్రిక్ ఆటోలు
- దశల వారీగా పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించే యోచన
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో పొల్యూషన్ క్రియేట్చేస్తున్న ఆటోలను కంట్రోల్‌చేసి, దశల వారీగా ఎలక్ట్రిక్‌వాహనాలను తీసుకువచ్చేందుకు ఆర్టీఏ సిద్ధమవుతోంది. 2021లో జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 17వేల ఎలక్ట్రిక్ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిటీలో 2 వేల ఆటోలకు పర్మిషన్ఇవ్వనుంది. ప్రస్తుతం హైదరాబాద్పరిధిలో 80 లక్షల వాహనాలు ఉండగా, ఇందులో 40 లక్షల వరకు టూ వీలర్లు, లక్ష వరకు ఆటోలున్నాయి.
టూ వీలర్లు వ్యక్తిగతం కాబట్టి వాటిని నియంత్రించలేమని, ఆటో పర్మిట్లు ఆర్టీఏ చేతిలో పని కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ఆటోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్లాన్చేస్తోంది. 2021 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం ఎలక్ట్రికల్వాహనాలకు సంబంధించి విధివిధానాలు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకురావాలని, అందులో 5 వేల ఆటోలను హైదరాబాద్పరిధిలో తిరిగేలా చేయాలని నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా గడిచిన మూడేండ్లలో గ్రేటర్‌పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ఆటోలకు ఆర్టీఏ పర్మిషన్ఇచ్చింది. 2022లో ఆటో పర్మిట్లు తీసుకున్న కొందరు ఎక్కువ ధరలకు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల పర్మిట్ల కోసం వచ్చే దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో పెట్టారు.
త్వరలో పాత ఆటోలన్నీ స్క్రాప్
2022లో 80 వేల ఆటోలు ఉండడం, కాలుష్యం పెరగడంతో పొల్యూన్తగ్గించేందుకు ఆర్టీఏ అప్పుడే కొత్త ఆటోల పర్మిట్లపై నిషేధం విధించింది. ప్రస్తుతం నగరంలో లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. వీటిలో చాలామటుకు పాత బడిపోవడంతో పెద్ద ఎత్తున ఎయిర్, సౌండ్పొల్యూషన్ఏర్పడుతోంది. హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా రూపొందించేందుకు త్వరలో 15 ఏండ్లు దాటిన పెట్రోల్, డీజిల్ఆటోలను స్ర్కాప్చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని ఆర్టీఏపై ఒత్తిడి వస్తుండడంతో త్వరలో ఎలక్ట్రిక్ఆటోల పర్మిషన్లు జారీ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోల పర్మిట్లను ఇస్తే ఎంతో కాలంగా ఆటోల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం మేలు చేసినట్టవుతుందని తెలంగాణ ఆటో డ్రైవర్స్సమితి(టీడీఎస్) ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
కొత్త పర్మిషన్లపై పరిశీలన
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల్లో ఎలక్ట్రిక్ఆటోల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్నాం. ఈసారి అన్నీ పక్కాగా ఉన్నవారికి, కొనుక్కొని బయట అమ్ముకోవడం లాంటి దందాలు చేయనివారికే పర్మిషన్లు ఇస్తాం. మొత్తంగా ఈవీలతో కాలుష్యం నుంచి నగరానికి విముక్తి కల్పిస్తాం.
– రమేశ్ కుమార్, హైదరాబాద్ జేటీసీ