తీసుకున్న పర్మిషన్​ ఓ లెక్క.. కడుతుంది మరో లెక్క! సూరారంలో కూల్చేసిన జీహెచ్ఎంసీ

తీసుకున్న పర్మిషన్​ ఓ లెక్క.. కడుతుంది మరో లెక్క! సూరారంలో కూల్చేసిన జీహెచ్ఎంసీ

జీడిమెట్ల, వెలుగు: గాజులరామారం సర్కిల్ పరిధి సూరారంలో జీహెచ్ఎంసీ టౌన్​ప్లానింగ్​అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. సిద్ధి వినాయక నగర్​లో  ముగ్గురు వ్యక్తులు స్టిల్​ప్లస్​టూ పర్మిషన్​తీసుకొని అదనంగా మరో రెండు అంతస్తులు, పెంట్ హౌజ్​నిర్మిస్తున్నారు. దీనిపై ఆర్.కె.ట్రాన్స్​ పోర్ట్​కు చెందిన జితేందర్​అనే వ్యక్తి  నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టును ఆశ్రయించాడు. 

దీంతో  కోర్టు ఆదేశాల మేరకు గురువారం రెండు భవనాల్లోని స్లాబ్​లు, గోడలను పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు. కాగా, టౌన్​ప్లానింగ్​అధికారులు రూ.20 లక్షలు లంచం అడిగారని, అంత మొత్తం ఇవ్వలేమని చెప్పడంతోనే  కూల్చివేతలు చేశారని బాధితులు ఆరోపించారు. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు చేసినట్లు టౌన్​ప్లానింగ్​ అధికారులు తెలిపారు.