
- ఈవీ పాలసీ ఉన్నా కొత్త ఆటోలకు నో పర్మిషన్
- పాత ఆటోను స్ర్కాప్ చేస్తేనే అనుమతి
- మంత్రి పొన్నం హామీతో ఆటో డ్రైవర్లలో ఆనందం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో త్వరలో ఎలక్ట్రిక్ఆటోలకు పర్మిట్లు ఇవ్వనున్నారు. నగరంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో 2002లో ఆటోలకు అనుమతిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వమే కొన్ని వాహనాలకు అనుమతులివ్వగా, మరికొందరు ఇతర జిల్లాల నుంచి ఆటోలను తీసుకువచ్చి నగరంలో నడుపుకుంటున్నారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్వెహికల్(ఈవీ) పాలసీని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్వాహనాలు కొనేవారికి రెండేండ్ల పాటు ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌లో రాయితీని ప్రకటించింది. దీంతో అధిక సంఖ్యలో టూ వీలర్లు, కార్లు, ఇతర వాహనాలు కొంటున్నారు. ఆటోల విషయానికి వచ్చేసరికి సర్కారు నిబంధనలు ఎలక్ట్రిక్ఆటోల కొనుగోలుకు అడ్డంకిగా మారాయి. సిటీలో కొత్త ఆటో కొనాలంటే ఎక్స్పైరీ అయిన ఆటోను స్క్రాప్చేయాలంటున్న ఆఫీసర్లు.. ఎటువంటి రూల్స్‌లేకుండా ఎలక్ట్రిక్ఆటోలు కొనడానికి పర్మిట్లు ఇవ్వడం లేదు.
మంత్రిని కలిసిన ఆటో సంఘాల లీడర్లు
ఎలక్ట్రిక్ఆటోలకు అనుమతి ఇవ్వాలంటూ ఆటోల సంఘాల లీడర్లు మూడు రోజుల కింద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇతర జిల్లాల నుంచి నగరంలోకి వస్తున్న ఆటోలను అనుమతిస్తున్న ఆర్టీఏ అధికారులు ఎలక్ట్రిక్ఆటోలు కొనేందుకు మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు.
దీంతో త్వరలోనే ఎలక్ట్రిక్ఆటోలకు పర్మిట్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయమై ఆర్టీఏ ఉన్నతాధికారులను సంప్రదించగా, మంత్రి ఆదేశాల మేరకు ఎలక్ట్రిక్ఆటోలకు పర్మిట్లు జారీ చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆటో సంఘాల లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.