టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడేవి అన్నీ విషపు మాటలు, బొంకు మాటలే అని అన్నారు. పేర్ని నాని కుమారుడిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల మీద స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు తనను బూతుల నాని అంటున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల గురించి తాను ఎన్నడూ బూతులు మాట్లాడలేదని అన్నారు.పేర్ని కిట్టు గంజాయి వ్యాపారం చేస్తున్నాడని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కరోనా సమయంలో పేదలకు సేవ చేసిన వ్యక్తి పేర్ని కిట్టు అని అన్నారు.
75ఏళ్ళ వయసున్న చంద్రబాబువన్నీ విషపు మాటలే అని, 14ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్ కి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ హాయంలో బందరుకు పూర్వవైభవం వచ్చిందని, కృష్ణా యూనివర్సిటీ, ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది పేర్ని నానినే అని అన్నారు. చంద్రబాబు హయాంలో శాంక్షన్ కానీ పోర్ట్ శంకుస్థాపన కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు.