నడిచే నమ్మకం జగన్.. దగాకు ప్రతిరూపం చంద్రబాబు కూటమి.. పేర్ని నాని

రాజకీయవర్గాలు కూడా సామాన్యులు కూడా సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన వైసీపీ మేనిఫెస్టో ఎట్టకేలకు విడుదలైంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూనే వాటి ద్వారా అందించే నగదును పెంచారు జగన్. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే 5అడుగుల 10అంగుళాల నడిచే నమ్మకం అని, చంద్రబాబు కూటమి దగాకు ప్రతిరూపమని అన్నారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసేందుకు రెడీ అవుతోందని మండి పడ్డారు. సూపర్ 6అనేది మినీ మేనిఫెస్టో అని, అసలైన మేనిఫెస్టో త్వరలో ప్రకటిస్తామని అంటున్నారని అన్నారు.

మినీ మేనిఫెస్టో కోసమే లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్న బాబు దాన్ని ఎలా అమలు చేయగలరని అన్నారు.2019లో ఇచ్చిన హామీలు 99శాతం అమలు చేసిన ఘనత జగన్ ది అని, రుణమాఫీ లాంటి హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన చరిత్ర బాబుది అని అన్నారు.2014లో ప్రజలను మోసం చేసిన ముగ్గురే ఇప్పుడు మళ్ళీ కూటమిగా బయలుదేరారని అన్నారు. మోడీ కేసుల అధికారంలోకి వచ్చాక ప్రజల అకౌంట్లలో 15లక్షల వేస్తామని చెప్పి మోసం చేసారని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోను, జగన్ ఇచ్చిన మాటను జనం నమ్ముతారని, మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పేర్ని నాని. 

Also Read:ఈ మేనిఫెస్టో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వరం... బొత్స