జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75 వ జయంతి సందర్భంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏ మహనీయుడు స్పూర్తితో వైసీపీ ఆరంభించబడిందో అదే స్పూర్తిని కొనసాగిస్తూ మళ్ళీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్ని నాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం లేదా స్కూల్‌లో పుస్తకాల పంపిణీ, రహదారులు, కాలనీల్లో చెట్లు నాటడం వంటి సేవాకార్యక్రమాలు ఎంచుకుని చేపట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్ గారి ఆలోచన మేరకు ప్రతి వైసీపీ కార్యకర్త సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు.
అభివృద్ధిని అందరికీ పంచాలన్న వైఎస్సార్ కలలే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. వైఎస్సార్ ను స్మరించుకుంటూ పునరుత్తేజంతో అడుగులు వేస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నామని తెలిపారు పేర్ని నాని.