
సీఎం జగన్ మచిలీపట్నం సభలో సభలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో తనకు చివరి మీటింగ్ అంటూ మాట్లాడారు. మరోసారి జగన్ తో వేదికను పంచుకునే అవకాశం వస్తుందో రాదో అని వ్యాఖ్యానించారు, పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతున్నానని వేదిక పైనే ప్రకటించారు నాని.
రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్ పోర్ట్ పనులకు సీఎం జగన్ 2023 మే 22 సోమవారం రోజున శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న పేర్ని నాని ఈ కామెంట్స్ చేశారు. ఆయన కొడుకును రాజకీయాల్లోకి దింపాలని పేర్ని నాని ఆలోచరనలో ఉన్నారని అందుకే ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.