తనను కుల బహిష్కరణ చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డిని.. గ్రామంలోని రెడ్డి కులస్థులు కుల బహిష్కరణ చేశారు. అప్పటినుంచి ఆయనకు ఎటువంటి సాయం చేయకుండా, మాట్లాడకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని మల్లారెడ్డి ఆవేదన చెందాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లారెడ్డి మండల కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తనకు న్యాయం చేయాలని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తాను సమస్యను పరిష్కరిస్తానని గ్రామ సర్పంచ్ హామీ ఇవ్వడంతో మల్లారెడ్డి వాటర్ ట్యాంక్ దిగాడు.
For More News..