హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని ఆవేదన చెందాడు. కారణంలేకుండానే పదే పదే దాడి చేస్తుందని ఆమె నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని..దిక్కు తోచని స్థితిలో మీడియా ముందుకు వచ్చానని బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ లో నివాసముంటున్న టెమూజియన్..తన భార్య నుంచి రక్షణ కావాలని..పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.. వివరాల్లోకి వెళితే..
అల్వాల్ లో నివాసం ఉంటున్న టెమూజియన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఏపీ లని రాజోలు కు చెందిన టెమూజియన్ కు అమలాపురం కు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచి అకారణంగా భార్య లక్ష్మీ గౌతమి తనపై, తన తల్లిదండ్రులపై దాడి చేస్తూ హింసిస్తుందని టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తన చంపేదుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు.
ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని..అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం , పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని , వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి , తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.