ఆన్‌లైన్ క్లాసులో న్యూసెన్స్ చేసిన వ్యక్తి

పోలీసులకు కంప్లయింట్

హైదరాబాద్‌, వెలుగు: ఆన్ లైన్ క్లాస్ జరుగుతుండగా ఓ వ్యక్తి డాగ్ మాస్క్ తో  టీచర్లు, స్టూడెంట్స్ ను  తిడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు.  మెహదీపట్నంలోని వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం 9 వ క్లాస్  స్టూడెంట్స్ కు ఆన్ లైన్ లో ఇంగ్లిష్  క్లాస్ జరుగుతుండగా ఆన్ లైన్ లోకి ఓ వ్యక్తి ఎంటరై టీచర్, స్టూడెంట్స్ ను తిట్టాడు. బుధ, గురు వారాల్లోనూ అతను న్యూసెన్స్ చేసినట్లు టీచర్లు చెప్పారు.  దీంతో స్కూల్ మేనేజ్ మెంట్  సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్​ చేసింది.  ఆన్ లైన్ లోకి ఎంటరైన వ్యక్తి మాస్క్ పెట్టుకోవడంతో  ఎవరన్నదీ గుర్తించలేకపోయారు. స్కూల్ స్టూడెంటా.. వేరే  వ్యక్తి నా అని జూమ్ యాప్ వివరాలు తెలుసుకునేందుకు కేసు రిజిస్టర్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

For More News..

సింగరేణి సీఎండీ ఎక్స్​టెన్షన్​ చెల్లదు

ఫిబ్రవరి 25 నుంచి బీజేపీ ప్రచారం

4 నెలల్లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్లు