కొండాపూర్ ఫారెస్ట్ లో హైదరాబాదీ మర్డర్

కొండాపూర్ ఫారెస్ట్ లో హైదరాబాదీ మర్డర్
  •     తాగిన మైకంలో గొడవ  
  •     ఆటోలో తీసుకుపోయి అంతం చేసిన ఫ్రెండ్​

నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ ఫారెస్ట్ లో హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం..హైదరాబాద్​లోని బోరబండ కు చెందిన నోమన్ (26), ఫారుక్ స్నేహితులు. రెండు రోజుల కింద తాగి ఓ వైన్ షాప్ వద్ద గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి నోమన్, ఫారుక్ కొట్టుకున్నారు. ఇద్దరూ కంప్లయింట్ ​ఇవ్వడానికి పీఎస్​కు వెళ్లారు.

అయితే, ఫారుక్.. నోమన్​కు సర్ది చెప్పాడు. దోస్తుల మధ్య ఇదంతా ఏందని చెప్పి ట్రీట్​మెంట్​చేయిస్తానని గాంధీ దవాఖానకు తీసుకుపోయాడు. అక్కడి నుంచి ఆటోలో నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాలోని కొండాపూర్ శివారుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ మందు తాగారు. పాత గొడవను మనసులో పెట్టుకున్న ఫారుఖ్​..నోమన్​ను కత్తితో పొడిచి చంపాడు. నర్సాపూర్ పీఎస్​కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.