
ముంబైలో ఫాస్ట్ గా వెళుతున్న లోకల్ ట్రైన్ నుంచి పడి ఓ ప్యాసిండర్ మృతిచెందాడు. డోంబివిలి,దివా స్టేషన్ల మధ్య ముంబై ఫాస్ట్ లోకల్ ట్రైన్ ఈ సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కంపెనీలో సేల్స్ మెన్ పనిచేస్తున్న కేవూర్ సవాలా (37) గురువారం ఉదయం ముంబై ఫాస్ట్ లోకల్ ట్రైన్ ప్రయాణిస్తుండగా.. రద్దీఎక్కువగా ఉండటంతో డోర్ వద్ద నిలబడ్డాడు. వేగం పుంజుకోవడంతో సవారా బ్యాలెన్స్ తప్పి పట్టాలపై పడిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. అతడిని ఆస్పత్రికి తరలించడగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.