మలక్‌‌పేటలో నిషేధిత సిగరెట్లు సీజ్

మలక్‌‌పేటలో నిషేధిత సిగరెట్లు సీజ్

మలక్ పేట, వెలుగు: నిషేధిత విదేశీ సిగరెట్లను అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, చాదర్‌‌ఘాట్‌‌ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఓల్డ్‌‌ మలక్‌‌పేట వాహెద్‌‌ నగర్​లోని ఓ నివాసంలో మంగళవారం రాత్రి వారు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన 8 కార్టన్‌‌ల (ఫ్యూజన్‌‌ బాల్‌‌ టెక్నాలజీ) విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

వీటిని అంబర్ పేటకు చెందిన పఠాన్ యూసఫ్ (40) నిల్వ చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన సిగరేట్ల విలువ దాదాపు రూ.60 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.